విజయ్ దేవరకొండ చిత్రంలో నభా నటేష్

  • August 23, 2019 / 01:16 PM IST

“నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్” చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొన్న నభా నటేష్ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆల్రెడీ రవితేజ సరసన “డిస్కో రాజా” చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నభాకు ఇప్పుడు టాలీవుడ్ టాప్ యంగ్ హీరోస్ లో ఒకరైన సాయిధరమ్ తేజ్ మరియు విజయ్ దేవరకొండల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నట్లు తెలుస్తోంది. సాయి తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ప్రతితోజు పండగ” షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా అనంతరం సాయితేజ్ కథానాయకుడిగా నటించబోయే సినిమాలో నభాను నాయికగా ఫిక్స్ చేశారు.

అలాగే.. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాధ్ తెరకెక్కించనున్న “ఫైటర్” సినిమాలో కూడా కథానాయికగా నభాను పరిశీలిస్తున్నాడట పూరీ జగన్నాధ్. ఆయన దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సొంతం చేసుకొన్న “ఇస్మార్ట్ శంకర్” చిత్ర విజయంలో తన అందం-అభినయంతో నభా కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అందుకే పూరీ ఆమెను కన్సిడర్ చేస్తున్నాడు. ఈ రెండు ప్రొజెక్ట్స్ ఫైనల్ అయ్యాయంటే.. అప్పుడు వర్మ అన్నట్లు నభా నెక్స్ట్ ఇలియానా అవ్వడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus