స్టార్ డైరెక్టర్ తో నదియ రొమ్యాన్స్??

  • July 16, 2016 / 07:57 AM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఎన్నో మరచిపోలేని సీన్స్ ను రచించిన త్రివిక్రమ్ పవన్ కు అత్త పాత్రలో ప్రవేశ పెట్టిన నదియా పాత్రను చాలా చక్కగా డిసైన్ చేశాడు. ఆ సినిమా పేరు రాగానే ముందుగా గుర్తుకు వచ్చేది పవన్ కల్యాణ్ అయితే ఆ తరువాత వెంటనే గుర్తొచ్చేది అత్త పాత్రలో ఇరగదీసిన నదియా. ఇదిలా ఉంటే ఈ అత్తగారు ఇప్పుడు ఒక తమిళ స్టార్ డైరెక్టర్ తో రొమ్యాన్స్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదేదో రియల్ లైఫ్ లో అనుకుని పప్పులో కాలేశారు…కాదు కాదు…ఇది రీల్ లైఫ్ లో.

ఇంతకీ విషయం ఏమిటంటే….తాజాగ నదియ, మురుగదాస్-మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్నచిత్రంలోనూ ఓ పాత్ర చేయనుంది. ఇందులో మహేష్ బాబుకి విలన్ గా చేయనున్న డైరెక్టర్ సూర్యకి భార్య పాత్రలో నదియా కనిపించనుంది అని సమాచారం. ఇక అదే క్రమంలో డైరెక్టర్ ఎస్.జె.సూర్య, నదియాల మధ్య ఓ లవ్ ట్రాక్ కూడ ఉందని, ఇందులో వీరిద్దరూ రొమాన్స్ చేసుకునే సన్నివేశాలు సైతం కొన్ని సెకండ్ల పాటు ఉంటాయని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరో పక్క ఈ సినిమాకి సంభందించిన డీటేల్స్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు కానీ, మొత్తానికైతే అటు నదియా…ఇటు సూర్య పాత్రలు ఈ సినిమాకు చాలా కీలకం అని తెలుస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus