నల్లధనాన్ని అంతమొందించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం వంద శాతం ఉత్తమం అని మెగా బ్రదర్ నాగేంద్ర బాబు చెప్పారు. తాను మోదీ అభిమానిని కాదని.. భారతీయ జనతా పార్టీ నాయకుడిని అంతకన్నా కాదని, అయినా మంచి పని చేసిన వారిని అభినందించాలని వివరించారు. తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్లో పెద్ద నోట్ల రద్దుపై అరగంట పాటు మాట్లాడారు. పీఎం తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పలువురు చేస్తున్న విమర్శలన్నీ పనికిరానివని కొట్టిపడేశారు.
దేశానికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత తీసుకున్న అద్భుత నిర్ణయం ఇదని ప్రశంసించారు. అవినీతి క్యాన్సర్ తో బాధపడుతున్న మన దేశానికీ మోదీ మంచి చికిత్స చేశారని, ఆ బాధను మనం భరించాలన్నారు. ఇతర పార్టీ నాయకుల విమర్శకులకు భయపడని దమ్మున్న మగాడు మన ప్రధాన మంత్రి అని కీర్తించారు. అటువంటి నాయకుడికి ఇప్పుడు మనం సహకరిస్తే భవిష్యత్ మరింత బాగుంటుందని వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.