ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో రివీల్ అయిన నాగబాబు క్యారెక్టర్

  • June 23, 2018 / 06:18 AM IST

వరుసగా నాలుగు విజయాల తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న “అరవింద సమేత వీర రాఘవ” వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తారక్ మాస్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని మంచి యాక్షన్ సన్నివేశాలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి కావడంతో డబ్బింగ్ పనులు కూడా మొదలెట్టేసారు. తాజా షెడ్యూల్ పొల్లాచ్చిలో ప్లాన్ చేశారు. అక్కడ ఎన్టీఆర్, ఈషా రెబ్బాలపై కొన్ని సన్నివేశాలు, పాటని చిత్రీకరించనున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఇందులో జగపతిబాబు, నాగబాబులు కీలక రోల్స్ పోషిస్తున్నట్టు తెలిసిందే. అయితే నాగబాబు రోల్ ఏంటో ఈ రోజు బయటికి వచ్చింది. ఎన్టీఆర్ కి తండ్రిగా కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పారు.

వీరిద్దరి మధ్య ఉండే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయని సమాచారం. వీరిద్దరూ తండ్రి కొడుకులుగా నటించడం ఇదే తొలిసారి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మరి జగపతి బాబు హీరోయిన్స్ గా నటిస్తున్న పూజా హెగ్డే, ఈషా రెబ్బలలో ఎవరికీ తండ్రిగా కనిపించనున్నారో త్వరలోనే తెలియనుంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 10 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus