‘మెగా ఫ్యాన్స్’కు…సలహాలు-సూచనలు!!!

  • July 25, 2016 / 10:48 AM IST

టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ఇండస్ట్రీ ను ఒక ఊపి ఊపిన రోజులు ఇప్పటికీ జనం మరచిపోలేదు. అయితే ఆ తరువాత పాలిటిక్స్, వెంటనే పార్టీ క్లోస్ చెయ్యడం, మళ్లీ సినిమాలో ఎంట్రీ కలగలిపి చిరంజీవి మళ్లీ అభిమానుల కోసం సినిమా చేస్తున్నాడు అని అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా చిరు చేస్తున్న 150వ సినిమా విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే అదే క్రమంలో రాన్నున్న ఆగస్థు22న చిరు పుట్టిన రోజు కావడంతో ఆ రోజును గ్రాండ్ గా సేవ కార్యక్రమాలు చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నాడు మెగా బ్రదర్ నాగ బాబు.

విషయం ఏమిటంటే….వచ్చే నెల22న మెగా స్టార్ పుట్టిన రోజున చెయ్యవలసిన కార్యక్రమాలను డిస్‌కస్ చేసేందుకు మెగా అభిమాన సంఘాల నాయకులతో సమావేశమైన నాగ బాబు, వారికి దిశా నిర్దేశం చేశాడు…ఆయన మాట్లాడుతూ…చిరంజీవి ఇమేజ్ ని పెంచే విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలి అని, ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా, అంతేకాకుండా ఆయన ఇమేజ్ ను పెంచే విధంగా ప్లాన్ చెయ్యాలి అని చెబుతూ…ఎవ్వరూ తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎటువంటి కార్యక్రమాలు చేయవద్దని డబ్బు ఖర్చుతో పెద్దగా సంబంధం లేకుండా ఉండే సేవా కార్యక్రమాలను చేయాలని నాగబాబు ఒక స్పష్టమైన సూచనను చేసినట్లు మెగా సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వాదన, మరి మెగా బ్రదర్ మాట మెగా ఫ్యాన్స్ ఎంతవరకూ వింటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus