ఏ మాయ చేసావే … అద్భుతమైన ప్రేమ కథ చిత్రం. ప్రేక్షకులకు మంచి కథను అందించిన ఈ మూవీ అందులో హీరో హీరోయిన్ గా నటించిన నాగచైతన్య, సమంతల మధ్య ప్రేమను చిగురింప జేసింది. వారిద్దరూ అక్టోబర్ 6 న గోవాలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్యను పలకరించగా అనేక ఆసక్తికర సంగతులను వెల్లడించారు. నిశ్చితార్ధం కాకముందు తామిద్దరం ఎలా ఉన్నామో? అయినా తర్వాత కూడా అలాగే ఉన్నామని.. పెళ్లి తర్వాత మా మధ్య ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గదని ధీమా వ్యక్తం చేశారు. మీ కథ ను సినిమాగా చేస్తే ఒప్పుకుంటారా? అంటే.. సంతోషంగా చేస్తామని సమాధానం ఇచ్చారు. యువ దర్శకులకు చైతూ మంచి అవకాశం ఇచ్చారు.
ఎవరు ఉపయోగించుంటారో అనేది త్వరలోనే తెలియనుంది. ఇక సినిమాల విషయాలకొస్తే.. నాగ చైతన్య యుద్ధం శరణం చేస్తున్నారు. సమంత మాత్రం ఆరు సినిమాల్తో బిజీగా ఉంది. రామ్ చరణ్ సరసన రంగస్థలం చేస్తోంది. రాజుగారి గది-2 లో కీలక రోల్ పోషిస్తోంది. మహానటి లోను నటిస్తోంది. తమిళంలో విజయ్ హీరోగా నటించే 61, ఇరుంబు తిరాయ్, అనేతి కథైగల్ సినిమాల్లో సమంత కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాలన్నింటినీ కంప్లీట్ చేసి పెళ్లి పీటలపై కూర్చొనేందుకు సమంత ఉత్సాహపడుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.