టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంతలు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. వారి పెళ్లికి పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా (నవంబర్ 23 ) చైతూ, స్యామ్ ని తీసుకొని రెండు రోజుల ముందే గోవాకి వెళ్లారు. బీచ్ ఒడ్డున వారిద్దరూ సేదతీరారు. అయితే పుట్టిన రోజుకు ముందే ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం. సింపుల్ గా నిశ్చితార్ధం చేసుకున్నారని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
అందుకు సాక్ష్యంగా సమంత వేలికి ఉన్న వజ్రపు ఉంగరాన్ని చూపిస్తున్నారు. ఆమె ఇదివరకు బయట ఎప్పుడూ రింగ్ తో కనిపించలేదు. గోవా బీచ్ లో తీసుకున్న ఫోటోలో ఆమె చేతికి ఉంగరం ఉంది. దీంతో నెటిజనులు వారిద్దరికీ నిశ్చితార్ధం జరిగిపోయిందని నమ్ముతున్నారు. వీరి జోరు చూస్తుంటే తమ్ముడు అఖిల్ కంటే ముందుగానే అన్న నాగ చైతన్య ఓ ఇంటి వాడు అవుతాడని అనిపిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.