మంచి ముహూర్తం కోసం చూస్తున్న సమంత & నాగ చైతన్య!

  • September 10, 2016 / 02:06 PM IST

టాలీవుడ్ ప్రేమ పక్షులు సమంత & నాగ చైతన్యలు ఆనందంలో తేలియాడుతున్నారు. వారి ప్రేమకు రెండు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చైతూ ఎప్పుడు  అంటే  అప్పుడు పెళ్లి చేయడానికి తండ్రి అక్కినేని నాగార్జున సిద్ధంగా ఉన్నారు. “సమంతను ప్రేమిస్తున్నాని చైతన్య నాకు చెప్పినప్పుడు నేను చాలా ఆనంద పడ్డాను. అయితే పెళ్లి చేసుకోవడానికి కొంత టైం అడిగాడు. అతను ఎప్పుడు పెళ్లి చేయమంటే అప్పుడు చేస్తా ’’ అని మీడియా సమావేశంలో నాగ్ వెల్లడించారు.

తన చిన్నకొడుకు అఖిల్ నిశ్చితార్ధ వేడుక తేదీని ప్రకటించే సమయంలో తమ ఇంటి పెద్ద కోడలు సమంత అని పాత్రికేయులకు స్పష్టం చేశారు. చైతూ మాత్రం పెళ్లికి తొందర పడడం లేదు. మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నాడు. బలమైన శుభ ఘడియల్లో వివాహం జరిపించాలని పండితులను కోరుతున్నట్లు సమాచారం. అఖిల్ ఎంగేజ్ మెంట్ ముందుగానే చైతు నిశ్చితార్ధం ఉంటుందని అక్కినేని కుటుంబానికి చెందిన సన్నిహితులు చెబుతున్నారు.

https://www.youtube.com/watch?v=8kR2D-dMwWo

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus