‘ఓ బేబీ’ మూవీ పై చైతన్య కామెంట్స్?

  • June 17, 2019 / 03:56 PM IST

సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ బేబీ’ జూలై 5 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ‘మిస్ గ్రానీ’ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుందనేది అందరికీ తెలిసిన సంగతే. ‘సూపర్ డీలక్స్’ ‘మజిలీ’ వంటి వరుస హిట్లందుకున్న సమంత ఈ చిత్రంతో వరుసగా మూడో హిట్టందుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. ‘ఓ బేబీ’ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. విడుదలైన టీజర్ వినోదాత్మకంగా ఉండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా… సమంత చేసే ప్రతి సినిమాను విడుదలకు ముందే చూసే ఆమె భర్త, చైతన్య ‘ఓ బేబీ’ చిత్రాన్ని కూడా చూశాడట. ‘సినిమా చూస్తున్నంతసేపు బాగా ఎంజాయ్ చేశానని చైతన్య చెప్పాడట. అంటే సమంత ముందుగా చెప్పిన్నట్టు ‘ఓ బేబీ’ లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగానే ఉంటుందని అర్థమవుతుంది. సురేష్ బాబు, సునీతా తాటి కలిసి నిర్మించిన ఈ చిత్రంలో నాగశౌర్య కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రంతో పాటు ‘మన్మథుడు2′ ’96’ చిత్రాల్లో కూడా సమంత నటిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus