‘వెంకీ మామ’ కోసం అంత రిస్క్ చేశాడా?

Advertisement

మరో 4 రోజుల్లో అంటే డిసెంబర్ 13న ‘వెంకీ మామ’… చిత్రంతో మామ అల్లుళ్ళు థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘కోన ఫిలిం కార్పొరేషన్’ సంస్థలు కలిసి నిర్మించాయి. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా… నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ప్రమోషన్ల జోరును పెంచారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇదిలా ఉండగా.. ‘వెంకీ మామ’ చిత్రం కోసం నాగ చైతన్య చాలా పెద్ద రిస్క్ చేశాడట. ఈ చిత్రంలో నాగచైతన్య కెప్టెన్ కార్తీక్ అనే ఆర్మీ అధికారి పాత్ర పోషిస్తున్నాడు.. ఇందుకోసం కాశ్మీర్ లో చలికి గడ్డకట్టే ప్రదేశాలలో సీన్లు షూట్ చేశారట.

అసలు మ్యాటర్ ఏంటంటే.. సోన్ మార్గ్, పహల్ గాన్ వంటి మైనస్ డిగ్రీలో చలి కలిగిన ప్రదేశాలలో ఈ చిత్రంకోసం గుర్రాల పైవెళ్ళి మరీ షూటింగ్ చేశారట. ఇక్కడ తీసిన సీన్లు చాలా అద్భుతంగా వచ్చాయని తెలుస్తుంది. ఈ ప్రదేశాలలో ఒక టేక్ తీయడమే చాలా కష్టం.. కానీ పర్ఫెక్షన్ కోసం చైతూ 3, 4 టేకులు కూడా చేసాడట. అంతలా రిస్క్ చేసి మరీ ఈ చిత్రం చేసాడట చైతూ. ఇక తమన్ సంగీతంలో వచ్చిన ఈ చిత్రం పాటలకు కూడా మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus