టెలికాం ఇండస్ట్రియలిస్ట్ శ్రీధర్ రావు ఇంట్లో ఉగాది సంబరాల్లో సందడి చేసిన నాగ చైతన్య

  • March 24, 2023 / 04:57 PM IST

టెలికాం ఇండస్ట్రియలిస్ట్  నెంబర్ వన్  శ్రీధర్ రావు జూబ్లిహిల్స్   రోడ్ నెంబర్ 49 లోని అభి శ్రీ రెసిడెన్సీ లో ఏర్పాటు చేసిన ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. ఉగాది ఉత్సవతం తో పాటు శ్రీధర్ రావు కుమారుడు అభి శ్రీ సత్యం జన్మదినానికీ టాలీవుడ్ నటుడు నాగ చైతన్య , మ్యూజిక్ డైరెక్టర్ అనూప్   రూబెన్స్,  రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా,  ఎమ్మెల్సీ రమణ ,  మాజీ యం.పి  అంజన్ కుమార్, పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి, హిమజ తో పాటు పలువురు ప్రముకులు హాజరయ్యారు. నటుడు నాగ చైతన్య  అభిశ్రీ తో కేక్ కట్ చేయించి, అభినందించారు. ఇక గ్రామీణ  వాతావరనాన్ని తలపించే విధంగా  ఏర్పాటు చేసిన సంప్రదాయ ఎడ్ల బండి, గ్రామీణంగా కనిపించే ఇళ్లు, చేద బావి..వంటి దృశ్యాలు అందరినీ కనువిందు చేశారు. టాలీవుడ్ పాట లైవ్ మ్యూజిక్  ఆకట్టుకున్నది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus