సమంతతో ప్రేమ, పెళ్లి గురించి యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తొలి సారి నోరు విప్పారు. ప్రేమ ఎప్పుడు పుట్టిందో చెప్పలేము కానీ .. ఇద్దరం ప్రేమించుకుంటున్నామని స్పష్టం చేశారు. రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చైతూ ఆసక్తికర సంగతులను వెల్లడించారు.
“మా పరిచయం ఏ మాయ చేసావే చిత్రం అప్పుడు ఏర్పడింది. కష్టసుఖాలు మాట్లాడుకునేవాళ్లం. సినిమాలు హిట్ , ఫ్లాప్ అయినప్పుడు చర్చించుకునేవాళ్లం. అలా మాకు తెలియకుండానే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. అలాగే ప్రేమికులుగా మారిపోయాము.” అంటూ వివరించారు. పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా…”ఈ సంవత్సరంలో కాదు. వచ్చే ఏడాది పెళ్లిచేసుకుంటాం. ఇంకా ముహూర్తం ఫిక్స్ చేయలేదు.” అని చైతూ తెలిపారు. సమంత మతం మార్చుకున్నది అనే వార్తలో నిజం లేదని చెప్పారు. ఒక పూజ లో తామిద్దరం పాల్గొన్నాం.. అంతే కానీ మత మార్పిడి కాదని క్లారిటీ ఇచ్చారు. పెళ్లి అయిన తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తుందని స్పష్టం చేశారు.