ఈసారి రాశికన్నా కన్ఫ్యూజ్ చేస్తుంది..!

  • February 22, 2019 / 07:37 PM IST

వెంకటేష్ – నాగచైతన్య కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. నాగ చైతన్య తో తన ఇద్దరి మావయ్యలు కలిసి చేస్తున్న ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం స్టార్ట్ అయ్యినప్పటి నుండీ రకరకాల వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ చిత్రం స్క్రిప్ట్ విషయంలో నిర్మాత సురేష్ బాబు డైరెక్టర్ బాబీ పై ఒత్తిడి చేసారని.. దీంతో బాబీ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నారని… కాబట్టి ‘వెంకీ మామ’ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. అయితే వెంకటేష్ స్వయంగా అలాంటిది ఏమీ లేదు..’ఎఫ్2′ చిత్రం పూర్తయిన వెంటనే ‘వెంకీ మామ’ మొదలవుతుందని కన్ఫర్మ్ చేయడంతో ఈ వార్తలు ఆగాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ల విషయంలో కూడా రోజుకో వార్త బయటకి వస్తుంది.

మొదట వెంకటేష్ సరసన శ్రీయని అనుకున్నారు… తరువాత ఆ స్థానంలో ‘ఆర్.ఎక్స్.100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నట్టు వార్తాహలు వచ్చాయి. ఇక చైతూ పక్కన మొదట రకుల్ ను తీసుకుందామని అనుకున్నప్పటికీ… రకుల్ ‘మన్మథుడు 2’ వైపు మొగ్గు చూపడంతో, ఆమె స్థానంలో నభా నటేశ్ ను తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నాభా నటేష్ ప్లేస్లో రాశి ఖన్నా చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో తనకు జోడీగా రాశి ఖన్నా అయితే బాగుంటుందనే చైతూ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఆమెను ఖరారు చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ.. ఎదురు చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus