చైతు రెడీ అవుతున్నాడు..!

  • April 16, 2016 / 01:08 PM IST

నాగచైతన్య, గౌతం మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ సినిమాలో చైతుకి జంటగా మంజిమా మోహన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

సినిమాలోని ముఖ్యమైన పాత్రల మధ్య పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఈ నెల 25న సినిమా పాటలను విడుదల చేసి మే చివరి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏ.ఆర్.రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. వీరందరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus