మమ్మల్ని బతకనివ్వండి : నాగ శౌర్య

  • July 4, 2016 / 01:35 PM IST

“ఒక మనసు” మంచి చిత్రంగా పేరుతెచ్చుకున్నా.. ఆ సినిమా హీరో, హీరోయిన్లు మాత్రం ఆనందంగా లేరు. తెర పై వీరిజోడి చాలా బాగుందని అభినందనలకు సంబరపడిన నాగ శౌర్య, నిహారికలు.. రియల్ లైఫ్ లో ప్రేమలో ఉన్నారని వస్తున్న వార్తలపై విసుగు చెందారు. ఆ రూమర్లకు చెక్ చెప్పాలని ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చారు. తామిద్దరం ప్రేమించుకోవడం లేదని స్పష్టం చేశారు.  “ప్రయాణాల్లో పరిచయమైతేనే ఫ్రెండ్ అని పిలుస్తాం. అలాంటిది మూడు నాలుగు నెలలు కలిసి పని చేస్తే స్నేహితులు కాకుండా ఎలా ఉంటాం? బయట కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం. నవ్వుకుంటాం.

అప్పుడు ఫోటోలు తీసి .. మేమిద్దరం ప్రేమలో ఉన్నామని రాయడం ఎంతవరకు మంచిది. ఇవన్నీ నమ్మొద్దు. నేను నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే నేను చెప్పేవరకు నమ్మొద్దు” అని నాగ శౌర్య చెప్పారు. ఇంకా అతను మాట్లాడుతూ “సినిమా తారలపైనా రాసే వాళ్ళు ఎప్పుడూ రాస్తూ ఉంటారు. కానీ చదివే వారు తగ్గిపోతే.. రాయడం ఆపేస్తారు. కాబట్టి మమ్మల్ని అభిమానించేవాళ్ళు  ఇలాంటివి చదవడం మానేస్తే, మేం ఎక్కువకాలం బతుకుతాం” అని అన్నారు. నాగ శౌర్య మాటలు చూస్తుంటే రూమర్లు అతన్ని ఎంతగా డిస్ట్రబ్ చేశాయో తెలుస్తోంది.

అనంతరం మెగా ప్రిన్సెస్ స్పందిస్తూ “ఇండస్ట్రీలో అభినందలతో పాటు .. రూమర్స్ వస్తుంటాయి. వాటిని ఫాలో అయ్యేవారు కూడా ఉంటారు. కానీ నాకు నాగ శౌర్యకు మధ్య వృత్తి పరమైన స్నేహమే ఉంది. అది నాకు తెలుసు. అందుకే ఆ రూమర్లను నేను సీరియస్ గా తీసుకోను. మీరు తీసుకోవద్దు.” అని వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus