నాగశౌర్య-షామిలి సినిమా టైటిల్ ఫిక్స్

  • December 12, 2017 / 10:16 AM IST

ప్రస్తుతం తెలుగులో మంచి క్రేజ్ తోపాటు మంచి అభినయ సామర్ధ్యం కలిగిన యువ కథానాయకుల్లో నాగశౌర్య ఒకడు. మంచి లవర్ బోయ్ ఇమేజ్ ఉన్నప్పటికీ.. మధ్యలో మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడడంతో వరుసబెట్టి ఫ్లాప్స్ చవిచూడాల్సి వచ్చిందే కానీ లేకుంటే హ్యాపీగా లవ్లీ హీరోగా ఈపాటికి స్టార్ డమ్ ఎంజాయ్ చేయదగ్గ స్థాయి ఉన్న హీరో నాగశౌర్య. ప్రస్తుతం సొంత బ్యానర్ లో “ఛలో” చిత్రంలో నటిస్తున్న నాగశౌర్య ఆ సినిమాకి బిజినస్ పరంగానే కాక జనాల్లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాతోపాటు నాగశౌర్య మరో నాలుగు సినిమాలు సైన్ చేశాడు.

వాటిలో ఒకటి పవన్ సుందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్. “ఓయ్” ఫేమ్ షామిలీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఈ చిత్రానికి “అమ్మమ్మగారిల్లు” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. “అత్తారింటికి దారేది, గోవిందుడు అందరివాడేలే” చిత్రాల తరహాలో కుటుంబ బంధావ్యాల నేపధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఈ సినిమాల లిస్ట్ చూస్తుంటే.. నాగశౌర్య యువ కథానాయకుల రేస్ లో ఈ ఏడాది అగ్ర స్థానంలో నిలిచేలా ఉన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus