టిక్కిల్‌ రోడ్డులో తిరిగా – నాగ శౌర్య

  • January 22, 2018 / 10:50 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఛలో’. యువ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో అతని తల్లి దండ్రులు ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్, ట్రైలర్ యువతను ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులతో సందడి చేశారు. కళాశాల ఆడిటోరియంలో అందరితో కలిసి కొద్దిసేపు మాట్లాడారు.

“నేను విజయవాడలోనే పెరిగాను, టిక్కిల్‌ రోడ్డులో తిరిగాను. నగరానికి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది” అని చెప్పారు. అలాగే పైరసీని ఎంకరైజ్‌ చేయవద్దని విద్యార్థులను కోరారు. ఊహలు గుసగుసలాడే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ శౌర్య.. ఆ తర్వాత అనేక సినిమాలు చేసినప్పటికీ అంతటి విజయం అందుకోలేదు. నిహారికతో చేసిన ఒక మనసు కూడా ఆశించినంత విజయం సాధించకపోవడంతో చలో సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. కన్నడ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఈ చిత్రంతో తెలుగువారికి పరిచయం కానుంది. నాగ శౌర్య, ర‌ష్మికల జోడీ ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus