ఛలో దర్శకుడ్ని సర్ ప్రైజ్ చేసిన శౌర్య

  • February 15, 2018 / 06:36 AM IST

తమ కెరీర్లు కష్టాల్లో ఉన్నప్పుడు తమకు హిట్ ఇచ్చిన డైరెక్టర్లకు హీరోలు గిఫ్ట్ ఇవ్వడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. మొన్నామధ్య ‘శ్రీమంతుడు’ సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు స్వయంగా కొరటాల శివ కోసం ఒక కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు అదే తరహాలో నాగశౌర్య తన కెరీర్ కు “ఛలో”తో బూస్ట్ ఇచ్చిన యువ దర్శకుడు వెంకీకి మంచి కారు గిఫ్ట్ గా ఇవ్వనున్నాడట. ఆల్రెడీ బుకింగ్ కూడా చేసేశాడట. వెంకీకి కారు గిఫ్ట్ గా ఇవ్వనున్న శౌర్య సినిమా యూనిట్ మెంబర్స్ అందరికీ కూడా గిఫ్త్స్ ప్లాన్ చేశాడట. ఈ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఒక ఈవెంట్ కూడా నిర్వహించి.. ఆ ఈవెంట్ లైవ్ లోనే అందరికీ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్స్ చేయనున్నాడు.

మంచి అంచనాల నడుమ విడుదలైన “ఛలో” చిత్రానికి భారీ అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా ఆదేవారం విడుదలైన “టచ్ చేసి చూడు” డిజాస్టర్ గా నిలవడం ఈ చిత్రానికి రెండువారాల పాటు ప్లస్ పాయింట్ అయ్యింది. అలాగే.. ఈవారం కూడా “తొలిప్రేమ” మినహా మరో మంచి సినిమా లేకపోవడంతో కామెడీ ఎంజాయ్ చేసేవాళ్ళందరూ ఇంకా “ఛలో” వైపే మొగ్గుచూపుతుండడం సినిమాకి బాగా కలిసొస్తోంది. ఈ ఆనందంలోనే హీరో శౌర్య ఈ గిఫ్ట్స్ ప్రెజంటేషన్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్లున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus