క్యూట్ హీరోయిన్ సాయిపల్లవితో యంగ్ హీరో శౌర్యకి డిఫరెన్సస్ ఎందుకు వచ్చాయో తెలియదు కానీ. ఇద్దరూ పిల్లి-ఎలుకల కంటే దారుణంగా దాగుడుమూతలాడుతున్నారు. ఇద్దరూ కలిసి “కణం” అనే తెలుగు-తమిళ బైలింగువల్ మూవీలో నటించారు. సినిమా షూటింగ్ టైమ్ లో వచ్చిన డిఫరెన్సెస్ వల్లనో లేక వేరే ఏమైనా కారణం ఉందో తెలియదు కానీ. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనే స్థాయి గొడవలు జరుగుతున్నాయి. మొన్నామధ్య తమిళ వెర్షన్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి హీరో నాగశౌర్య (Naga Shourya) హాజరవ్వకపోవడమే పెద్ద ఇష్యూ అయ్యింది.
ఇప్పుడేమో నిన్న హైద్రాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా శౌర్య హాజరవ్వకపోవడం చర్చనీయాంశం అయ్యింది. ఎంత సినిమా యూనిట్ తో ఇబ్బంది ఉంటే మాత్రం కనీసం ప్రమోషన్స్ లో కూడా పాల్గొనకపోవడం పట్ల అందరూ శౌర్యపై సీరియస్ అయ్యారు. ఇకపోతే. సాయిపల్లవి మోస్ట్ ఇరిటేటింగ్ ఆర్టిస్ట్ అని శౌర్య చెప్పడం పట్ల సాయిపల్లవి నిన్న స్పందిస్తూ. “శౌర్య మంచి కో ఆర్టిస్ట్, మంచి నటుడు” ని పేర్కొనడం విశేషం. ఈ ఇద్దరి మధ్య గొడవలు ఎలా ఉన్నా. వీళ్ళ ఈగోల కారణంగా “కణం” సినిమాకి మాత్రం ఫ్రీ పబ్లిసిటీ బాగానే లభిస్తోంది.