Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

ఒక పెద్ద సినిమా వస్తేనే.. ఇంకో సినిమాకు ప్లేస్‌ లేని ఇండస్ట్రీ మనది. అందుకే ఒక శుక్రవారం ఒక పెద్ద సినిమా మాత్రమే అని ఒక అనధికారిక రూల్‌ పెట్టుకుని మనోళ్లు సినిమాలు రిలీజ్‌ చేస్తూ ఉంటారు. అయితే ఈ రూల్‌ని సంక్రాంతి లాంటి పండగ సీజన్లలో పక్కన పెడుతుంటారు. ఆ సీజన్‌లో ఒకటి కాదు, మూడు పెద్ద సినిమాలు వచ్చినా ఓకే అనుకుంటారు. ఈ క్రమంలో ఓ చిన్న సినిమాను మధ్యలో సెట్‌ చేసి కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ సాధిస్తుంటారు మన నిర్మాతలు.

Naga Vamsi

గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సీజన్‌లో రిలీజ్‌ అయిన పెద్ద సినిమాలకు టికెట్లు దొరక్కపోతే.. ఇంకో సినిమా ఏదైనా ఉందా అని చూసి చిన్న సినిమాకు టికెట్లు బుక్‌ చేసినవాళ్లను మీరు చూసే ఉంటారు. మీరు కూడా అలా బుక్‌ చేసే ఉంటారు. ఒకప్పుడు ఒక సినిమాకు థియేటర్లు హౌస్‌ఫుల్స్‌ అయితే.. పక్కనే ఉన్న మరో సినిమాకు వెళ్లినట్లు అన్నమాట. వచ్చే ఏడాది ఈ అవకాశాన్ని అందుకోవాలని నాగవంశీ ప్లాన్‌ చేస్తున్నారట.

అదే ‘మ్యాడ్‌ 3’/ ‘మ్యాడ్‌ జూనియర్స్‌’. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు సినిమాలు రాగా.. అందులో తొలి భాగం మంచి విజయం అందుకుంది. మూడో భాగంతో అదే పని చేయాలని నాగవంశీ అనుకుంటున్నారట. ఈ మేరకు సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారని టాక్‌. ఈ మేరకు త్వరలోనే సినిమా రిలీజ్‌ డేట్‌ గురించి అధికారిక ప్రకటన రాబోతోందట.

‘మ్యాడ్’, ‘మ్యాడ్ 2’ సినిమాల్లోలో నటించిన హీరోలు ముగ్గురు మూడో ‘మ్యాడ్‌’లో కనిపించరు. ‘కోర్టు’ సినిమా ఫేమ్ హర్ష్ రోషన్, ‘లిటిల్ హార్ట్స్’ కమెడియన్‌ జయకృష్ణతోపాటు మరో కుర్రాడు ఉంటారట. ‘మ్యాడ్’ గ్యాంగ్ బయటికి వెళ్లిపోయాక కాలేజీలోకి కొత్తగా వచ్చిన కుర్రాళ్ల కథతో ఈ సినిమా తెరకెక్కుతోందట. మరి కొత్త కుర్రాళ్లు ఎంతవరకు ‘మ్యాడ్‌’ ఎక్కిస్తారు అనేది చూడాలి.

మొదటి వారానికే 131 శాతం రికవరీ సాధించిన సీన్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus