Naga Vamsi: డాకు మహరాజ్ పై నాగవంశీ సంచలన పోస్టు!

బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు డబుల్ సంక్రాంతి రాబోతోంది! ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) 2025, జనవరి 12 నుండి థియేటర్లలో సందడి చేయనుంది. బాబీ కొల్లి (Bobby) దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi)  నిర్మాణంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ‘దబిడి దబిడి’ సాంగ్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యి ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా…నిర్మాత నాగవంశీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ఒక సంచలన ట్వీట్ వేశారు.

Naga Vamsi

సమరసింహారెడ్డి (Samarasimha Reddy)  సినిమాలోని పవర్‌ఫుల్ సీక్వెన్స్ పోస్టర్ ను జతచేసి ‘డాకు మహారాజ్’లో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని ప్రకటించారు. సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గొడ్డలితో విలన్లను ఊచకోత కోసే సీన్, జయప్రకాశ్ రెడ్డితో డైలాగ్స్ (నా తండ్రి నెత్తుటి మరకలు, దొంగలా రాలేదు, దొరలా వచ్చాను, నీ ఊరు వచ్చా…) ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి. ఆ సీక్వెన్స్ మాస్ సినిమా అంటే ఏమిటో రుచి చూపించింది. ” ‘డాకు మహారాజ్’లో కూడా అలాంటి ఒక సీన్ ఉంటుంది.

అది మళ్లీ అదే క్రేజ్, వైబ్, గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ‘దబిడి దిబిడి’ ఊరికే అనట్లేదు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్!” అని నాగవంశీ ట్వీట్ చేయడం జరిగింది. ‘డాకు మహారాజ్’ కథ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ, ఇది బాలకృష్ణ గత చిత్రాలైన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు (Narasimha Naidu) వంటి సినిమాలను పోలి ఉంటుందని నాగవంశీ హింట్ ఇచ్చినట్టు అయ్యింది. మరి బాబీ లాంటి డైరెక్టర్ బాలకృష్ణ వంటి మాస్ హీరోను ఎలా డీల్ చేశాడు అనేది చూడాలి.

అలా అయితే ఆ హీరోయిన్ 2 యేళ్ళు ఆగాలా ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus