బాలయ్య అనంతరం జగన్ పై విరుచుకుపడనున్న నాగబాబు

మన మెగాబ్రదర్ నాగబాబు గత కొన్ని రోజులుగా బాలకృష్ణను టార్గెట్ చేస్తూ వరుసబెట్టి వీడియోలు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఫ్యాన్ వార్స్ కూడా గట్టిగానే జరుగుతున్నాయి. అయితే.. చాలామంది ప్రశ్నిస్తున్నది ఒకటే బాలయ్య ఏదో అన్నాడని మిడిసిమిడిసి పడుతున్న నాగబాబు “జబర్దస్త్” షోలో తన పక్కన కూర్చుని నవ్వే రోజా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ను నోటి కొచ్చినట్టు తిట్టడమే కాక.. పవన్ కళ్యాణ్ అమ్మాయిలతో పడుకుంటాడు అని చాలా హేయమైన పద్ధతిలో నీచంగా మాట్లాడింది. మరి ఆమెను ఎందుకు ఏమీ అనడం లేదని నాగబాబుని తిరిగి ప్రశ్నిస్తున్నారు.

అయితే.. నాగబాబు నెక్స్ట్ టార్గెట్ జగన్ అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఏదో కార్లు మార్చినట్లు పెళ్లాలను మార్చాడని ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వై.ఎస్.ఆర్.సి.పి శ్రేణులు అదే విషయమై పవన్ ను చాలాసార్లు టార్గెట్ చేసి మాట్లాడారు. ఇప్పుడు నాగబాబు ఈ విషయమై జగన్ & కో కు కౌంటర్ ఇవ్వనున్నాడు. బాలయ్య విషయంలో అంటే టిడిపి శ్రేణులు లైట్ తీసుకున్నాయి కానీ.. జగన్ కి నాగబాబు కౌంటర్ వేస్తే మాత్రం వైసీపీ పొరపాటున కూడా ఊరుకోదు. మరి ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus