బాలకృష్ణను వదిలిపెట్టని మెగా బ్రదర్

  • December 26, 2018 / 01:17 PM IST

“పవన్ కళ్యాణ్ ఎవరు?” అని అన్న విషయాన్ని బాలకృష్ణతోపాటు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది మర్చిపోయారు కానీ.. మన మెగా బ్రదర్ నాగబాబు మాత్రం మరిచినట్లు లేరు. ఇటీవలే నాకు బాలకృష్ణ ఎవరో తెలీదు అని కామెంట్ చేసి రచ్చ చేసిన నాగబాబు.. ఆ మరుసటి రోజే నాకు బాలయ్య తెలుసు కానీ ఆయన నందమూరి బాలయ్య కాదు, మరో బాలయ్య అని హల్ చల్ సృష్టించారు. ఆ విషయాన్ని మెలమెల్లగా అందరూ మర్చిపోతున్న తరుణంలో నాగబాబు మళ్ళీ బాలయ్యను టార్గెట్ చేశాడు. ఇటీవల బాలయ్య తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా “సారే జహాసే అచ్ఛా” గీతాన్ని ఆలపిస్తూ “బుల్ బుల్” దగ్గర ఆగిపోయి పబ్లిక్ గా అభాసుపాలైన విషయం తెలిసిందే.

                                                

తాజాగా నాగబాబు ఈ విషయమై బాలయ్యను టార్గెట్ చేస్తూ తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో ఒక పిల్లాడు పాడిన సారే జహాసే అచ్ఛా వీడియోను పోస్ట్ చేశాడు. దాంతో మళ్ళీ సర్ధుమణిగింది అనుకొన్న నాగబాబు-బాలయ్య ఎపిసోడ్ మొదటికొచ్చింది. ఇప్పటివరకూ బాలయ్య డైరెక్ట్ గా నాగబాబును ఏమీ అనకపోయినా.. నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఆయన్ను ఇరగాడేసుకొంటున్నారు. జబర్దస్త్ లో కుళ్ళు జోకులకు నవ్వే నాగబాబు ఇలా సీరియస్ గా పోస్టులు పెడుతున్నా కామెడీగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ నందమూరి మెగా వార్ కి రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ రచ్చ రోజురోజుకూ పెరిగిపోతోంది. చివరికి ఏమవుతుందో వాళ్ళకే తెలియాలి. .

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus