అక్కినేని ప్రిన్స్ అఖిల్ తొలి సినిమా నిరాశపరచడంతో రెండో సినిమాపై బాగా దృష్టిపెట్టారు. కథ దగ్గర నుంచి అన్ని విషయాల్లో శ్రద్ధ వహిస్తున్నారు. అక్కినేని కుటుంబానికి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ చేతిలో అఖిల్ ని నాగార్జున పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తిచేసుకుంది. కేవలం యాక్షన్ సీక్వెన్స్ కోసమే 12 కోట్లు ఖర్చు పెట్టారు నాగ్. “జున్ను”, “ఎక్కడ ఎక్కడ ఉందో తారక” అనే రెండు పేర్లు కూడా రిజిస్టర్ చేయించారు.
అంతేకాకుండా హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ ని నాగార్జున సెలక్ట్ చేసినట్లు వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై నాగ్ స్పందించారు. ఆ వార్తలు నిజం కావని స్పష్టం చేశారు. అఖిల్ తో నటించే హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయలేదని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ తార నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.