సంక్రాంతికి పోటీ పడనున్న ఆ నలుగురు

  • October 20, 2016 / 01:13 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమకు 2017 వ సంవత్సరం కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనుంది. సంక్రాంతిని పురస్కరించుకుని జనవరిలో పెద్ద హీరోల సినిమాలు సందడి చేయనున్నాయి. క్రిష్ దర్శకత్వంలో నట సింహ బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జనవరి 12 న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. తొమ్మిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీతో జనవరి 13న రంగంలోకి దిగుతున్నారు. వీరి మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించే లోపు ఆ రింగ్ లోకి నేను సై అంటూ విక్టరీ వెంకటేష్ “గురు” తో రావడానికి ముస్తాబు అవుతున్నారు.

అగ్రహీరోలు సంక్రాంతికి పోటీ పడుతుంటే.. తాను రాకుంటే బాగుండదేమో అనుకున్నారో.. ఏమో.. కింగ్ నాగార్జున కూడా సంక్రాంతి రేసులో పాల్గొంటానంటూ ప్రకటించారు. ప్రస్తుతం నాగ్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు డైరెక్షన్లో  ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రాన్ని చేస్తున్నారు.  నాణ్యంగా సినిమా రావాలనే ఉద్దేశంతో మెల్లగా షూటింగ్ చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ ఎప్పుడు అనుకున్నారో.. అప్పటి నుంచి చిత్రీకరణలో జోరు పెంచారు. డిసెంబర్ నాటికి ఈ మూవీని పూర్తి చేసి చిరు, బాలయ్య, వెంకీ చిత్రాలకంటే ముందుగా జనవరి మొదటి వారంలో ప్రేక్షకులను పలకరించాలని నాగ్ ఆలోచిస్తున్నారు. అయితే జనవరి నెల భలే మజా ఇవ్వనున్నదన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus