కింగ్ నాగార్జున లో మంచి నటుడు మాత్రమే కాదు తెలివైన వ్యాపారవేత్త కూడా ఉన్నారు. ఆయన వేసే ప్రతి అడుగు పక్క ప్లాన్ తో వేస్తారు. మరో సారి నాగార్జున సక్సస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా వ్యవహరించారు. ఆ వివరాల్లోకి వెళితే.. మనం, సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి వంటి విజయాలతో ఉన్న నాగ్ ప్రస్తుతం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ” ఓం నమో వేంకటేశాయ” చిత్రాన్ని చేస్తున్నారు.
తోటి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ,వెంకటేష్ తమ చిత్రాలని సంక్రాంతికి రిలీజ్ చేస్తుంటే.. ఒక నటుడిగా తాను కూడా బరిలోకి దిగాలని భావించారు. తర్వాత వ్యాపారవేత్తగా ఆలోచించారు. ఈ పోటీ వల్ల సినిమా ఎంత బాగున్నా ఆర్ధికంగా నష్టపోతామని తెలుగుకొని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. “ఓం నమో వేంకటేశాయ” సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. హడావుడిగా చేయడం వల్ల క్వాలిటీ కూడా మిస్ అవుతుందని చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసినట్లు తాజా సమాచారం.