శ్రీరామ్ ఆదిత్య మీద చాలాసార్లు అరిచాను: నాగార్జున

Advertisement

మనిషిగా పుట్టిన ప్రతి వాడికి వద్దనుకున్నా ఉండే ఏకైక లక్షణం “ఈగో”. దీనికి మనిషి మానసిక లేక సంపన్న పరిస్థితితో సంబంధం లేదు. అయితే.. ఈ “ఈగో” అనేది అందరికీ మంచి చేయదు. కొందరిని అందలాలు ఎక్కిస్తే, ఇంకొందర్ని పాతాళానికి తోసేస్తుంది. మన నవ మన్మధుడు నాగార్జునకు కూడా ఈ ఈగో పుష్కలంగా ఉందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకోవడంతోపాటు.. తన ఈగో కారణంగా “దేవదాస్” చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను చాలాసార్లు తిట్టానని, ఇబ్బందిపెట్టాని స్వయంగా ఒప్పుకొన్నాడు. షూటింగ్ టైమ్ లో నాగార్జున దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మీద చాలాసార్లు అరిచాడట, అంతేకాక పలుమార్లు శ్రీరామ్ ఆదిత్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్న విధానాన్ని కూడా తప్పుబట్టాడట.

ఈ విషయాలన్నీ నాగార్జున స్వయంగా చెప్పడంతోపాటు, మీడియా ముఖ్యంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు చిన్నసైజు సారీ కూడా చెప్పి.. అతను భవిష్యత్ లో తప్పకుండా పెద్ద దర్శకుడు అవుతాడని కితాబిచ్చాడు. ఇలా నాగార్జున లాంటి బడా స్టార్ హీరో తనకు ఈగో ఉందని ఒప్పుకోవడంతోపాటు తనతో వర్క్ చేసిన డైరెక్టర్ కి సారీ చెప్పడం అనేది అభినందించాల్సిన విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus