కొడుకుల కోసం నాగ్ త్యాగం!!!

  • February 16, 2016 / 07:26 PM IST

టాలీవుడ్ మన్మధుడు కింగ్, నాగార్జున వయసు పెరిగే కొద్దీ సొగసు కూడా పెరుగుతుంది. అయితే ఈ సంక్రాంతికి ‘సొగ్గాడే చిన్ని నాయన’ ఆంటీ దుమ్ము దులిపేసిన నాగ్, ఇప్పుడు తన కరియర్ పైన కన్నా, తన కొడుకులను సెటిల్ చేయాలనే తాపత్రంతో ఉన్నాడు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇక మరో పక్క ఇప్పటికే నాగ చైతన్య వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ….మెగా హీరోగా మారలేకపోతున్నాడు. ఇక మరో కొడుకు అఖిల్ విషయాన్నే తీసుకుంటే….ఊరించి…ఊరించి...తుస్సుమనిపించిన ‘అఖిల్’ సినిమా తరువాత తాను ఏ సినిమా చెయ్యాలో అన్న సందిగ్ధంలో పడ్డాడు. ఇదిలా ఉంటే తాజాగా నాగ్ సొగ్గాడిలో నటించిన ‘బంగార్రాజు’ పాత్ర దుమ్ము దులిపేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆ పాత్రకు మరో ప్రాణం పోస్తు సరికొత్త కధతో ముందుకు వచ్చాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. అంతేకాకుండా ఈ పాత్రకు నాగ్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాడని దర్శకుడు తెలుపగా, నాగ్ మాత్రం తనకు కాకుండా ఈ చిత్రాన్ని తన కొడుకులతో తెరకెక్కిస్తే బావుంటుంది అని చెబుతున్నాడంటా. ఒకవేళ తన కొడుకుల్లో ఎవరికైనా ఇస్తే ఎవరు బావుంటారు అని నాగ్ దర్శకుడిని అడగగా, ఆయన వెంటనే చైతు పేరు చెప్పడంటా. అయితే ఈ మాస్ పాత్రకి చైతు ఎంతవరకూ న్యాయం చేయగలడో చూడాలి. ఒకవేళ చైతు ఒప్పుకకపోతే అఖిల్ ఈ సినిమా చేసే చాన్స్ ఉంది, పైగా అఖిల్ కు ఇప్పుడు హిట్ చాలా అవసరం కదా. మరి ఆ ఇద్దరిలో ఎవరు ఈ పాత్ర చేస్తాలో చూద్దాం.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus