మళ్ళీ నటించడంపై స్పందించిన నమ్రత

  • March 1, 2017 / 10:39 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోత్కర్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారని, ఓ మల్టీ స్టారర్ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం సాగింది. 1993లో మిస్ ఇండియా కిరీటం అందుకున్న ఈమె 1998 లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి పాతిక చిత్రాల్లో నటించింది. వంశీ చిత్రం సమయంలో ప్రిన్స్ ని ప్రేమించి 2005 (ఫిబ్రవరి 10 ) లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఇంటికే పరిమితం అయింది. ఇప్పుడు తీరిక దొరకడంతో సినిమాల్లోకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది.

ఆ వార్తలపై నమ్రత స్పందించింది. అవన్నీ పుకార్లేనని కొట్టి పడేసింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “అవన్నీ పుకార్లే.. ఎవరో ఆ సిల్లీ రూమర్ పుట్టించారు. మళ్ళీ కెమెరా ముందుకు వచ్చే ప్లాన్స్ ఏమీ నాకు లేవు” అని స్పష్టం చేసింది. ప్రస్తుతం తన పిల్లలను చూసుకోవడంలో చాలా ఆనందంగా ఉన్నట్లు పేర్కొంది. పేరు, ప్రతిష్టలు, డబ్బు కంటే మాతృత్వం ఎంతో సంతృప్తిని ఇస్తుందని వెల్లడించింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus