Sitara Dance: నీ హృదయంతో డాన్స్ చేయి.. పాదాలు అనుకరిస్తాయి సితార డాన్స్ పై నమ్రత కామెంట్స్!

  • May 14, 2023 / 08:48 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక భర్తగా తండ్రిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత చిన్న వయసులోనే సితార ఎంతో టాలెంట్ కలిగి ఉందని చెప్పాలి.

సితార అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. యూట్యూబ్ ఛానల్ రన్ చేయడమే కాకుండా ఎన్నో పాటలకు డాన్స్ లు చేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక గతంలో సితార భరత నాట్యం నేర్చుకోబోతున్నారు అంటూ నమ్రత తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.. అయితే తాజాగా సితార భరత నాట్యం చేస్తున్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ విధంగా నమ్రత సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె భరతనాట్యం చేస్తున్నటువంటి వీడియోని షేర్ చేయగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వీడియోపై ఎంతోమంది స్పందిస్తూ సితార గ్రేట్ డాన్సర్ అంటూ కామెంట్స్ చేయగా, మరికొందరు సితార ఓ స్టార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సితార డాన్స్ పెర్ఫార్మెన్స్ పై అభిమానులు కామెంట్ చేస్తున్న నేపథ్యంలో నమ్రత సైతం తన కుమార్తె డాన్స్ వీడియో పై స్పందించకుండా ఉండలేకపోయారు.

ఈ క్రమంలోనే తన కుమార్తె డాన్స్ వీడియో పై స్పందించిన నమ్రత నీ హృదయంతో డాన్స్ చేయి నీ పాదం అనుకరిస్తుంది అంటూ డాన్స్ వీడియో పై కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నమ్రత తరచూ పిల్లల గురించి తన భర్త మహేష్ బాబు సినిమాల గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన కుమార్తె గురించి నమ్రత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus