టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు…ఇప్పుడు యూరప్ లో ఉన్నాడు. తాజాగా మహేష్ నటించిన బ్రహ్మోత్సవం చిత్రం భారీ డిజాస్టర్ గా మారడంతో, కాస్త రిలాక్స్ అయ్యేందుకు, అందమైన ప్రాంతాలను చూస్తూ తన ‘బ్రహ్మోత్సవం’ షాక్ నుండి బయట పడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
అదే క్రమంలో మరో నాలుగైదు రోజుల్లో ఇండియా రానున్న ప్రిన్స్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.. ఇంతకీ ఏంటి ఆ నిర్ణయాలు అంటే….తాజాగా నిర్మాతగా సైతం మారిన ప్రిన్స్ కు తన భార్య నమ్రత సలహాదారుగా ఉంది. అదే క్రమంలో నిర్మాణ విషయంలోనే కాకుండా, సినిమా కధల ఎంపిక విషయంలో కూడా నమ్రత కీలక పాత్ర పోషిస్తుంది అని టాలీవుడ్ లో టాక్. అయితే తాజాగా మహేష్ తీసుకునే నిర్ణయాలపై నమ్రత ప్రభావం ఉంటుంది అని సైతం తెలుస్తుంది.
తాజాగా బ్రహ్మోత్సవం విషయం తీసుకుంటే…నమ్రతతో పాటు ఆమె సన్నిహితులు వల్ల కలిగిన ప్రెషర్ వల్లనే ఈ సినిమా అనుకున్నంత బాగా రాలేదు అని, అంతేకాని దానికి శ్రీకాంత్ అడ్డాలను నిందించవద్దు అని ప్రిన్స్ ఇప్పటికే సన్నిహితుల వద్ద తెలిపినట్లు సమాచారం. అందుకే వాస్తవాన్ని గరించిన ప్రిన్స్ తన కోటరీని మార్చడమే కాకుండా భార్య నమత్రను సైతం ఇక నుంచి తన సినిమాల కథల విషయంలో జోక్యం చేసుకోవద్దని మహేష్ సున్నితంగా సూచించాడని టాక్. అయితే సినిమా నిర్మాణ వ్యవహారాలలో మాత్రం నమ్రత యధావిధిగా తన పాత్రను కొనసాగిస్తుందట. ఇక త్వరలో మహేష్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని చెయ్యనున్నాడు. ఇక ఈ చిత్రానికి దాదాపుగా 23కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడు. మరి ఈ సినిమా మహేష్ కు ఎలాంటి విజయాన్ని చేకూరుస్తుందో చూడాలి.