Namrata: జిమ్‌లో మహేష్ బాబు భార్య నమ్రత వర్కౌట్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

ఆన్ స్క్రీన్ క్యారెక్టర్‌ని బట్టి డిఫరెంట్‌గా కనిపించినా కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం ఎప్పుడూ ఫిజిక్ మెయింటెన్ చేస్తుండాలి స్టార్స్.. హీరోలు, హీరోయిన్లు అయితే తప్పదు కానీ స్టార్ హీరోల భార్యలకు పిల్లలు, బోలెడన్ని పనులతో జిమ్ చేసేంత టైం దొరకదు..పెళ్లి తర్వాత గుర్తు పట్టలేకుండా మారిపోయిన కథానాయికలను ఎందరినో చూశాం..

కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత మహేష్ మాత్రం.. భర్తలా తాను కూడా ఫిట్ నెస్ ఫ్రీకే అంటూ కష్టపడి వర్కౌట్స్ చేస్తున్న వీడియో షేర్ చేశారు. ట్రైనర్ సాయంతో కఠినమైన కసరత్తులు చేస్తూ చెమటోడుస్తున్నారు.. మహేష్ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలన్నీ చూస్తుంటారామె..

ఇద్దరు పిల్లల కేరింగ్.. ఏఎమ్‌బీ సినిమాస్, ఇటీవలే స్టార్ట్ చేసిన హోటల్ బిజినెస్, ఇతర ఫ్యామిలీ వ్యవహారాలతో ఎప్పుడూ బిజీగా ఉండే నమ్రత.. ఎన్ని పనులున్నప్పటికీ ఫిట్‌నెస్‌కివ్వాల్సిన ప్రాధాన్యతనివ్వాల్సిందేనంటూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. 3 మిలియన్ల మంది ఇన్‌స్టాలో ఆమెను ఫాలో చేస్తున్నారు..

మహేష్ బాబు భార్య జిమ్ లో అదరగొడుతుంది | Mahesh babu wife Namrata Gym Video | Filmyfocus.com

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus