మహేష్, విజయ్ సినిమా నిజం కాదంట..!

Advertisement

మహేష్ – నమ్రత టాలీవుడ్ క్యూట్ అండ్ సక్సెస్ ఫుల్ కపుల్. సినిమాల విషయంలోనే కాకుండా బిజినెస్ విషయంలో వీరి ప్లాన్స్ అదిరిపోతాయి అనడంలో సందేహం లేదు. ఓ పక్క మల్టీ ప్లెక్స్ బిజినెస్ తో పాటూ నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టి సినిమాలు చేస్తున్నారు. గతంలో ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు చేసారు. ఇప్పుడు మహేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. అయితే సహా నిర్మాతలుగానే సినిమాలు చేస్తూ వచ్చారు.

అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్మాతలుగా మారి సినిమాలు చేయడానికి కూడా రెడీ అయ్యారు. ఇప్పటికే అడివి శేష్ తో ఓ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించారు. 26/11 ముంబై దాడుల్లో చనిపోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవిత ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందట. ఇదిలా ఉండగా ఇప్పుడు విజయ్ దేవరకొండ తో కూడా ఓ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ‘మహర్షి’ షూటింగ్ స్పాట్ లోనే కాకుండా, ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా విజయ్ హాజరవ్వడంతో మహేష్, విజయ్ కలిసి ఓ చిత్రం చేస్తున్నారని టాక్ నడిచిన సంగతి తెలిసిందే. అయితే అసలు విషయం అది కాదంట.. ఇదేనంట..! విజయ్ తో చేయబోయే చిత్రం పనుల్ని నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news