బిగ్ బాస్ షో ద్వారా ఎన్టీఆర్ బుల్లితెర ప్రేక్షకులకు ఎలా చేరువయ్యి తన స్టార్ డమ్ & పాపులారిటీ ఎలా పెంచుకొన్నాడో అందరికీ తెలిసిందే. సెకండ్ సీజన్ హోస్ట్ నాని అనగానే నాని కూడా అదే స్థాయిలో స్టార్ డమ్ & పాపులారిటీ సొంతం చేసుకొంటాడేమో అనుకొన్నారు అందరూ. కట్ చేస్తే. సీన్ రివర్స్ అయ్యింది. ఈ షో పుణ్యమా అని నాని నెగిటివ్ అయిపోయాడు.”నిన్నమొన్నటివరకూ బయట అందరూ మంచోళ్లే అనుకొంటూ ఉండేవాడ్ని, కానీ.. ఒక్కసారి బిగ్ బాస్ షో చేసిన తర్వాత జనాలు మరీ ఇలా ఆలోచిస్తున్నారా, సిల్లీ ఇష్యూస్ మీద ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటున్నాయా, మరీ ఇంత గుడ్డిగా నమ్మి ఫాలో అయిపోతున్నారా” అనిపించింది.
నేను నటించిన “పిల్ల జమీందార్” సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. “గెలిస్తే ఏముందిరా నువ్ ప్రపంచానికి పరిచయమవుతావ్, అదే ఓడిపోయి చూడు ప్రపంచం నీకు పరిచయం అవుతుంది” అది నా జీవితానికి ఇప్పుడు పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది. బిగ్ బాస్ చేసి చూడు ప్రపంచం పరిచయమవుతుంది” అన్నట్లుగా తయారయ్యింది నా సిచ్యుయేషన్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే.. బిగ్ బాస్ చేశాక నాకు కళ్ళు తెరుచుకున్నాయ్ అని నాని ఇవాళ జరిగిన “దేవదాసు” ప్రమోషన్స్ లో మీడియాతో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించడం పట్ల తన ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకోవడం విశేషం.