అసిస్టెంట్ డైరక్టర్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి హీరోగా ఎదిగిన నాని మళ్లీ డైరక్టర్ గా మారారు. మెగా ఫోన్ పట్టి లైట్స్.. కెమెరా.. యాక్షన్ అంటూ క్రూ కి కమాండ్స్ ఇస్తున్నారు. భలే భలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, జెంటిల్ మాన్ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న నాని..
డైరక్షన్ వైపు ఎందుకు వెళ్ళాడు ? అని ఆవేశపడి తిట్టేయకండి.. జెంటిల్ మాన్ విజయోత్సవంలో ఉన్న ఈ యువనటుడు నిన్న బాహుబలి – ది కంక్లూజన్ సెట్స్ కి వెళ్లారు. అక్కడి టీమ్ తో ఇదివరకు నాని “ఈగ” సినిమాకు పని చేశారు. ఆ చనువుతో ఎస్.ఎస్. రాజమౌళి మెగా ఫోన్ అందుకొని కాసేపు హంగామా చేశారు. లైట్స్.. కెమెరా.. యాక్షన్ అంటూ అరిచారు.
ఈ విషయాన్ని బాహుబలి బృందం ఈ రోజు ఉదయం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. “జెంటిల్ మాన్ నాని నిన్న మా సెట్స్ కి వఛ్చి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. సరదాగా గడిపారు” అని ట్వీట్ చేసింది.
Our Gentleman, @NameisNani made a surprise visit to our sets yesterday like he usually does! 😀 #Baahubali2 pic.twitter.com/qybxd1PkUo
— Baahubali (@BaahubaliMovie) June 23, 2016