దువ్వాడ జగన్నాధమ్ ఫై నాని కామెంట్స్ ?

  • July 6, 2017 / 06:46 AM IST

న్యాచురల్ స్టార్ నాని…మన పక్కింటి కుర్రాడు లాగా నటిస్తాడు… అన్న మంచి పేరు ఉన్న నాని…మన టాలీవుడ్ పరిశ్రమలో ఎదగడానికి చాలా కష్టపడ్డాడు…అయితే సినిమా సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న నాని, సహజంగానే వివాదాలకు దూరంగా ఉంటాడు…అయితే నాని తాజాగా నటించిన సినిమా ‘నిన్నుకోరి’ ఈ సినిమా రేపు విడుదల కావస్తు ఉండడంతో ప్రమోషన్ లో బిజీగా గడుపుతున్నాడు నాని…అయితే ఆ ప్రమోషన్ లో భాగంగా నాని మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి…ఆ మాటలు డీజె టార్గెట్ గానే నాని మాట్లాడాడు అన్న టాక్ బయటకి రావడంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త కోపంగానే ఉన్నారు…అసలు నాని ఏమన్నాడు…అదే క్రమంలో దానికి బన్నీ డీజె కి ఏంటి సంభంధం అంటే….ఒకసారి మీరే ఈ కధను చదవండి మీకే అర్ధం అయిపోతుంది…ప్రమోషన్ లో భాగంగా నాని మాట్లాడుతూ….తన పెరుగుదల కోసం తన సినిమాల బడ్జెట్ పెంచను అని అంటూ తన సినిమా గొప్ప అని అనిపించుకోవడానికి లేనిపోని లెక్కలు చెప్పను అంటూ నాని అన్నాడు…అంతేకాకుండా…భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీసిన తరువాత సినిమా ఆడినా లాభాలు రాకపోతే ఫ్లాప్ అంటారు అది తనకు నచ్చదు అంటూ నాని తెలిపాడు…ఒక బిజినెస్ ను 10-20 శాతం పెంచుకోవడంలో తప్పులేదు.

కానీ లేనిపోని జిమ్మిక్కులు చేసి 50 శాతం, 100శాతం పెంచడం అది హీరోకి గాని ఆ సినిమా బయ్యర్లకు మంచిదికాదు అంటూ నాని చేసిన కామెంట్స్ చేశాడు…అయితే వాస్తవానికి నాని తన మాటల్లో ఎక్కడా బన్నీ ప్రస్తావన తీసుకురాకపోయినా అదే విధంగా ‘డిజే’ గురించి ఒక్క మాట కూడ మాట్లాడక పోయినా నాని మాట్లడిన ప్రతీమాటలో బన్ని గుర్తుకు వచ్చాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి అంతేకాకుండా ‘దువ్వాడ’ ను ద్రష్టిలో పెట్టుకుని నాని ఈ కామెంట్స్ చేశాడు అంటున్నారు… అయితే నాని మాట్లాడిన ప్ర్యాక్టికల్ మాటలను రాంగ్ గా తీసుకోకుండా పాసిటివ్ గా తీసుకోవాలి…ఆయన ఏ సినిమాని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చెయ్యలేదు అన్న సంగతి గుర్తు పెట్టుకుంటే మంచిది…చూద్దాం మరి బన్నీ ఫ్యాన్స్ ఏమంటారో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus