‘జెర్సీ’ చిత్రం పై నాని కామెంట్స్..!

  • April 9, 2019 / 03:08 PM IST

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ‘జెర్సీ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 19 న విడుదల కాబోతుందని నిర్మాతలు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందించాడు. ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో నాని ఈ చిత్రం గురించి అలాగే ఈ చిత్రంలో తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతుల్ని తెలియజేసాడు.

ఈ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. ” ఈ సినిమాతో బరువు బాగా తగ్గాను. అయితే కావాలని బరువు తగ్గలేదు.. క్రికెట్ ఆడి… ఆడి.. దానికి సంబంధించిన వర్కౌట్లు చేయడం వల్ల నాకు తెలియకుండానే బరువు తగ్గాను. ఇప్పటివరకూ ‘జెర్సీ’ చిత్రాన్ని 20 సార్లు దాకా చూశాను.. స్క్రీన్ మీద ఉన్నది నేనేనా అని మైమరిచిపోయి మరీ సినిమా చూడడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ… ఎప్పుడు ఏ సినిమా చూసినా.. ఎక్కడో ఒక్కసారి మాత్రమే నాని బయటకి వచ్చేవాడు అనిపించేది. కానీ ఈ చిత్రంలో కేవలం అర్జున్ ని మాత్రమే చూసాను, నటుడిగా ఈ సినిమా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ చిత్రం తన లైఫ్ లో మోస్ట్ ఎమోషనల్ జర్నీ..! ఏ సినిమా విషయంలో కూడా నేను ఇంత ఎమోషనల్ గా ఫీల్ అవ్వలేదు. ‘జెర్సీ’లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు లైఫ్ లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus