Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

లక్షల మంది అభిమానుల నుండి వేల మంది అభిమానులను ఎంపిక చేయడం.. వారందరికీ ఒక వేదిక మీదకు తీసుకు రావడం చాలా కష్టం. కొన్ని రోజుల క్రితం ఓ స్టార్‌ హీరో టాలీవుడ్‌లో ఇలాంటి పని చేశారు. వావ్‌ అనిపించారు. దీని కోసం ఆ హీరో టీమ్‌లో చాలామంది పని చేశారు. ఆ కష్టం మొత్తం ఆ రోజు ఈవెంట్‌ జరగడానికి కొన్ని రోజుల ముందు, ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆ ఈవెంట్‌ గురించి ఆ హీరో సన్నిహితులు మాట్లాడుతూనే ఉన్నారు. అంత హంగామాతో ఆ ఈవెంట్ సాగింది.

Nani

ఇప్పుడు టాలీవుడ్‌లో ఇలాంటిదే మరో ఫ్యాన్స్‌ మీట్‌ జరిగింది. ఈ పని చేసింది నాని. తన అభిమానుల కోసం ఆయన ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలా ఆయన పది వేల మంది అభిమానులను కలిశాడట. ఫ్యాన్ మీట్ అంటే అభిమానులను కలసి ఓ స్పీచ్‌ ఇచ్చి ముగించేయడం కాదు. వచ్చిన వారందరికీ భోజనం పెట్టి.. సెల్ఫీ ఇచ్చి మరీ పంపించాడట నాని. ‘మీరు నన్ను ఫొటో అడగడం కాదు, మిమ్మల్నే నేను ఫొటో అడుగుతున్నా.. నాతో ఫొటో దిగుతారా అంటూ అభిమానులతో మాట్లాడాడట నాని.

తొలి రోజు సుమారు 10 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారని సమాచారం. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు ఉంటుంది అని చెప్పారట. ఆ లెక్కన సుమారు 20 వేల మందిని కలుస్తాడు అని అంటున్నారు. ‘ది ప్యారడైజ్‌’ సినిమా విడుదల అవ్వడానికి ముందే ఈ ఫ్యాన్స్‌ మీట్‌ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం, ఫొటోలు, వీడియోలు బయటకు రాలేదు. అవి బయటకు వస్తే ఇంకొన్ని విషయాలు బయటకు వస్తాయి.

ఇదంతా చూస్తుంటే.. మన హీరోలు అందరూ ఇదే తరహాలో ఫ్యాన్స్‌ మీట్‌ పెట్టేలా ఉంది. ఎందుకంటే తమ అభిమాన హీరోను అలా కలసి ఫొటోలు దిగాలని ఫ్యాన్స్‌ కోరుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్‌, నాని ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఈ పని చేశారు.

షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus