నాని కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

  • April 21, 2017 / 02:07 PM IST

నేచురల్ స్టార్ నాని సూపర్ ఫాస్ట్ వేగంతో దూసుకు పోతున్నారు. నాని ప్రస్తుతం నూతన దర్శకుడు శివ నిర్వాన డైరెక్షన్లో ‘నిన్ను కోరి’ సినిమా చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ వంటి ఆకర్షణీయమైన లోకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం వైజాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని జూలై లో విడుదల చేయాలనీ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.   ఈ మూవీ  తర్వాత ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించేందుకు ఒకే చెప్పారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న సినిమాకి ” ఎంసిఏ ” అని టైటిల్ ని అనుకున్నారు.  ఆ తరువాత హను రాఘవపూడి తో సినిమా చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఈ సినిమాకు ”అదిగో అల్లదిగో” అనే టైటిల్ ఖ‌రారు చేశారు. కృష్ణగాడి వీర ప్రేమగాధ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో షూటింగ్ కు వెళ్ల‌నుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus