నాని తోనే శ్రీకాంత్ అడ్డాల మూవీ

  • September 20, 2018 / 06:23 AM IST

కొత్త బంగారులోకం సినిమా చూసిన తర్వాత పరిశ్రమకి ఓ మంచి దర్శకుడు వచ్చాడని అందరూ ఆనందించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో శ్రీకాంత్ అడ్డాల తెలుగువారి అభిమాన దర్శకుడయిపోయారు. ముకుంద సినిమాని సహజత్వానికి చాలా దగ్గరగా తీసి శెభాష్ అనిపించుకున్నారు. కానీ మహేష్ బాబు తో అతను తీసిన బ్రహ్మోత్సవం మాత్రం చాలా అంటే చాలా నిరాశపరిచింది. ఆ ప్రభావంతో రెండేళ్లు అవుతున్నా అతని ప్రాజెక్ట్ ఏది సెట్స్ మీదకు వెళ్లలేకపోయింది. ప్రకటనకు కూడా నోచుకోలేదు. ఫలానా హీరోతో శ్రీకాంత్ సినిమా చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ అవన్నీ గాసిప్ గానే నిలిచిపోతోంది.

కొంతకాలంగా శర్వానంద్ తో సినిమా చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అవి నిజం కాదని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. తాజా సమాచారం ప్రకారం నేచురల్ స్టార్ నాని తో శ్రీకాంత్ అడ్డాల సినిమా చేయబోతున్నారంటూ తెలిసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మితం కానుంది. ప్రస్తుతం నాని నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ మూవీ దేవదాస్ చేస్తున్నారు. దీని తర్వాత జెర్సీ మూవీ చేయనున్నారు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాని మూడు షేడ్స్ చూపించనున్నారు. ఆ తర్వాత శ్రీకాంత అడ్డాల మూవీ పట్టాలెక్కనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus