కౌశల్ ఆర్మీపై సంచలన కామెంట్స్ చేసిన నాని

  • September 27, 2018 / 06:08 AM IST

సినీ నేపథ్యం లేకపోయినప్పటికీ, కష్టపడి హీరోగా ఎదిగిన వారిలో నాని ఒకరు. సహజమైన నటనతో, పక్కింటి కుర్రోడిలా కనిపించి నేచురల్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. తెలుగు ప్రజల్లో అతనికున్న క్రేజ్ కారణంగా స్టార్ మా ఛానల్ వారు పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా తీసుకున్నారు. తనదైన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు. కానీ షో భాగంగా పార్టిసిపెంట్స్ తప్పులని ప్రశ్నించాల్సి ఉంటుంది. ఆ సమయంలో కౌశల్ ని కూడా ప్రశ్నించారు. అది అతని అభిమానులకు నచ్చలేదు. దీంతో కౌశల్ అభిమానులు నానిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అతను హీరోగా నటించిన దేవదాస్ సినిమాని చూడవద్దని బహిరంగంగానే పోస్ట్ లు పెట్టారు.

ఈ విషయాన్ని నాని ముందు ఉంచగా ఆయన ఇలా స్పందించారు. ““కౌశల్ ఆర్మీ”కి అంత సీన్ లేదు. మీరు ఇలాంటివి నమ్ముతారా?” అంటూ విలేకరులను ఎదురు ప్రశ్నించారు. ఇంకా మాట్లాడుతూ “ఎంతో మంది కలిసి కష్టపడి తీసిన చిత్రాన్ని కేవలం ఒక్కడి కోసం ఆపలేము. సినిమా విడుదల పట్ల ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా సినిమా విడుదల చేస్తాం” అని తెలిపారు. నాని చెప్పినట్టుగా ఈరోజు సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి ఏ విధంగా ఆకట్టుకుంటుందో? కౌశల్ ఆర్మీ ప్రభావం దేవదాస్ పై ఎంతమేర ఉంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus