Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

ఒక దెబ్బ తగిలాక జాగ్రత్త పడాలి అంటారు. అంత జాగ్రత్త పడినా ఇంకో దెబ్బ తగలితే ఇంకాస్త జాగ్రత్తపడాలి అంటారు. అంతే తప్ప ఇంకొకరిని నిందిస్తే ఉపయోగం లేదు. ఈ మాట మేం చెప్పేది కాదు.. మన పెద్దలు ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని సినిమాలకు ఆపాదిస్తే.. ఒక ఫ్లాప్‌ పడ్డాక జాగ్రత్త పడకపోతే.. మరో ఫ్లాప్‌ వచ్చి పడుతుంది. అయితే తొలిసారి వచ్చిన ఫ్లాప్‌.. డిజాస్టర్‌ అయితే.. త్వరగా జాగ్రత్తపడాలి.

Nani – Shiva Nirvana

ఇదంతా ‘ప్యారడైజ్‌’ సినిమా చేసిన నాని గురించే. ఈ సినిమాకు సంబంధించి టాక్‌ విషయంలో ఎలాంటి మిక్స్‌డ్‌ లేకపోయినా.. వసూళ్ల విషయంలో సినిమా టీమ్‌ చెబుతున్న నెంబర్లు చూస్తుంటే టాక్‌ డివైడింగ్‌ ఏమన్నా ఉందా అనే డౌట్‌ కలుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ త్వరలో వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు సినిమాల కథల ఎంపిక విషయంలో నానికి అయితే ఓ క్లారిటీ వచ్చింది అనిపిస్తోంది. అదే యాక్షన్‌కి కాస్త దూరంగా ఉండాలని.

కెరీర్ ప్రారంభంలోనే పక్కింటి కుర్రాడు ఇమేజ్ సంపాదించుకున్నాడు నాని. అయితే ఆ తర్వాత ఎవరు చెప్పారో లేక ఆయనకే అనిపించిందో కానీ యాక్ష‌న్‌, మాస్ క‌థ‌ల్ని ఎంచుకోవ‌డం మొద‌లెట్టాడు. ‘ద‌స‌రా’ సినిమాతో విజయం సాధించడంతో నాని ఆలోచన కరెక్టేమో అనిపించింది. అయితే ఎక్కడో ‘అవసరమా నాని’ అనే మాటలు కూడా వినిపించాయి. ‘స‌రిపోదా శ‌నివారం’ సినిమా హిట్‌ కొట్టడంతో మళ్లీ ‘నానినే కరెక్ట్’ అనే మాట వచ్చింది.

కానీ ఇప్పుడు ‘పార‌డైజ్‌’ సినిమాతో ‘యాక్షన్‌ మనకొద్దు బాబూ..’ అనే మాట బలంగానే వస్తోంది. తన కోటలాంటి ఇమేజ్‌ని ఇలాంటి యాక్షన్‌ సమ్మెటలతో బద్దలుకొట్టడం సరికాదు అంటున్నారు ఫ్యాన్స్‌. ఈ మాటలు బాగా విన్న నాని.. ఇప్పుడు కథల ఎంపిక విషయంలో భావోద్వేగాలు, బంధాలు – అనుబంధాలవైపు వస్తున్నాడట. ‘బ్లడీ రోమియో’ సినిమా తర్వాత ఇక ఇలాంటి కథలతో బ్రేక్‌ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడట. అలాగే ‘బ్లడీ రోమియో’లో బ్లడ్‌ తగ్గించే ఉద్దేశంలో కూడా ఉన్నాడట. ‘బ్లడీ రోమియో’ తర్వాత చేయబోయే సినిమా కోసం ఇప్పటికే నాని.. శివ నిర్వాణ, వెంకీ అట్లూరి లాంటి క్లాస్‌ దర్శకులతో టచ్‌లోకి వెళ్లాడట.

‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus