ఇండస్ట్రీలో హీరో అవ్వాలని కలతో హైద్రాబాద్ వచ్చిన ప్రతి నటుడికి.. నటుడిగా సెటిల్ అయ్యాక మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేయాలన్న కోరిక తప్పకుండా ఉంటుంది. ఒక దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీపై ఆయన వేసిన మార్క్ అలాంటిది. అటువంటి దర్శకుడితో పనిచేసే అవకాశాన్ని “ఒకే బంగారం”తో సొంతం చేసుకొన్న నాని.. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం మాత్రం వచ్చినట్లే వచ్చి చేజార్చుకొన్నాడు. అది కూడా రెండుసార్లు. “చెలియా, నవాబ్” చిత్రాల్లో తొలుత నానిని కథానాయకుడిగా అనుకొన్నారు మణిరత్నం. కానీ.. కారణాంతరాల వలన ఆ ప్రోజెక్ట్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు నానికి తనను రెండుసార్లు మోసం చేసిన మణిరత్నంపై పగ తీర్చుకొనే అవకాశం వచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన “నవాబ్” రేపు విడుదలవుతోంది. భారీ మల్టీస్టారర్ గా తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ మీద మాత్రం పెద్దగా ఎవరికీ హోప్స్ లేవు. “దేవదాసు” సినిమా మీద ఆల్రెడీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ కాబట్టి.. సరిగ్గా ప్లాన్ చేసుకొంటే నాని డైరెక్టర్ మణిరత్నం మీద రివెంజ్ తీసుకోవడం చాలా ఈజీ.; ఈ రెండు సినిమాలతోపాటు “నాటకం” అనే మరో తెలుగు చిత్రం కూడా ఈవారం విడుదలవుతోంది. దీంతోపాటు హిందీలో “సూయి దాగా” అనే సినిమా కూడా విడుదలవుతోంది.