బాలయ్య సరసన నాని హీరోయిన్..?

  • February 4, 2019 / 09:45 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలు బ్లాక్ – బస్టర్ హిట్లు గా నిలిచాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మూడో చిత్రం రాబోతుంది. హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో.. ఈ ప్రాజెక్టు పై ఆసక్తి నెలకొంది. బాలయ్య సొంత నిర్మాణ సంస్థ అయిన ‘ఎన్.బి.కె ఫిలిమ్స్’ పతాకం పై ఈ చిత్రం తెరకెక్క బోతుందని తాజా సమాచారం.

ఈ సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’, బోయపాటి శ్రీను ‘వినయ విధేయ రామా’ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ఎలాగైనా సరే భారీ హిట్టు కొట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనీ వీరిద్దరూ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తాజా సమాచారం. ఇక ఈ చిత్రంలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తుండడంతో… ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తుంది. ఇందులో ఒక హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం శ్రద్ధ శ్రీనాథ్.. నాని హీరోగా నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus