‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘జెర్సీ’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ సంగీతమందించిన ఈ చిత్రం ఏప్రిల్ 19 న విడుదలయ్యింది. మొదటి షో తోనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 11 రోజులకి గానూ ‘జెర్సీ’ చిత్రానికి 25.07 కోట్ల షేర్ వచ్చింది.
‘జెర్సీ’ మొదటి 11 రోజులకి గానూ.. ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
వైజాగ్ – 2.24 కోట్లు
ఈస్ట్ – 1.29 కోట్లు
కృష్ణా – 1.29 కోట్లు
వెస్ట్ – 0.88 కోట్లు
నెల్లూరు – 0.58 కోట్లు
————————————————
ఏపీ + తెలంగాణ – 17.99 కోట్లు
రెస్ట్ అఫ్
ఇండియా – 2.08 కోట్లు
ఓవర్సీస్ – 5.0 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ – 25.07 కోట్లు (షేర్)
————————————————–
‘జెర్సీ’ చిత్రానికి 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 26 కోట్లకు పైగా షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి 11 రోజులకి ఈ చిత్రం 25.07 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 1 కోటి షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘కాంచన3’ ‘ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్’ చిత్రాల వలన ఈ చిత్రం కలెక్షన్లు బాగా దెబ్బతిన్నాయి. ఒక విధంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. రేపు మే 1 హాలిడే ఉండడంతో ఈ చిత్రానికి మరింత కలిసొచ్చే అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని ‘జెర్సీ’ ఎంతవరకూ ఉపయోగించుకుంటుందో చూడాలి. ఏదేమైనా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం ఖాయమవ్వడంతో హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుందనే చెప్పాలి. మొత్తానికి రెండు ప్లాపుల తర్వాత నాని ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంతవరకూ కలెక్ట్ చేస్తుందో చూడాలి..!