నాని తర్వాత సినిమా విడుదల అప్పుడే !!

  • March 20, 2017 / 01:27 PM IST

నేచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నాని సూపర్ ఫాస్ట్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.  ప్రతి మూడు నెలలకు ఒకటి చొప్పున సినిమాలను రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నారు. నేను లోకల్ సినిమాని రిలీజ్ చేసిన వెంటనే ఆ  చిత్ర విజయాన్ని ఆస్వాదించకుండానే మరో చిత్రాన్ని మొదలెట్టేయడం, సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగిపోయాయి. నూతన దర్శకుడు శివ నిర్వాన డైరెక్షన్లో నాని “నిన్నుకోరి” చిత్రాన్ని చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ వంటి ఆకర్షణీయమైన లోకేషన్లలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం వైజాక్ లో హీరో నాని, హీరోయిన్ నివేత థామస్ లపై రొమాంటికి సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టనున్న ఈ మూవీని  జూలై 11వ తేదీన రిలీజ్ చేయాలనీ నిర్మాత ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్నీ చిత్ర బృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus