సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ ను తాజాగా విడుదల చేసాడు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్ పడ్డ ఆవేదనను చూపించే ప్రయత్నం చేసాడు వర్మ. వర్మతో పాటు అగస్త్య మంజు కూడా సహా దర్శకుడిగా వ్యవహరించాడు. చంద్రబాబుని నెగెటివ్ యాంగిల్ లో చూపిస్తూ ఎన్టీఆర్ కి అతడు చేసిన అన్యాయాన్ని దృశ్య రూపంలో చూపించే ప్రయత్నం చేశాడు వర్మ. ఇక ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ ట్రైలర్ పై… నారా మరియు నందమూరి ఫ్యామిలీలు అసహనంతో ఉన్నాయట. ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ కూతురు లక్ష్మీ పార్వతిని బూతులు తిడుతూ చెయ్యి చేసుకున్నట్టు చూపించాడు వర్మ. అంతేకాదు హరికృష్ణ పై కూడా నెగటివ్ షేడ్స్ ఉండేలా చిత్రీకరించాడు. దీంతో ఇరు కుటుంబాలు సమావేశమై ఈ ట్రైలర్ పై చర్చించుకున్నారట. ఈ చిత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల కాకుండా చేయడానికి.. వారి వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తుంది. బాలయ్య – చంద్రబాబులు తమకు పరిచయమున్న లాయర్లను సంప్రదిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ చిత్రానికి లక్ష్మీ పార్వతి సపోర్ట్ ఉండడంతో అది వీలుకాదని వారు తేల్చి చెప్పారంట. అసలే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉండడంతో… ఈ చిత్రం చంద్రబాబు,’టీ.డీ.పి’ పార్టీ తో పాటు బాలయ్య ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి వారు ఈ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు స్పష్టమవుతుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!