విభిన్నకథలను ఎంచుకుంటూ నారా రోహిత్ మొదట్లో విజయాలను అందుకున్నారు. ఆ తర్వాతే అతను తీసుకునే కథల్లోనూ.. డైట్ లోను మార్పు వచ్చింది. అందుకే రోహిత్ సినిమాలు హిట్ ట్రాక్ తప్పాయి. బాడీ వెయిట్ కంట్రోల్ తప్పింది. ఈ విషయాన్నీ అతను పెద్దగా సీరియస్ తీసుకోలేదు. డైరక్టర్ తేజ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. తన సినిమాలో మంచి రోల్ ఇచ్చి.. బరువు తగ్గాలని టాస్క్ ఇచ్చారు. మంచి అవకాశం.. మంచి మాట ఏది వదులుకోకూడదనుకున్నారు నారా రోహిత్. అందుకే నోరు కట్టుకొని ఒంట్లో కొవ్వుని కరిగించారు. బరువులు ఎత్తుతూ బరువు తగ్గించారు. ఒకటి కాదు రెండు కాదు పది కిలోలు తగ్గారు.
విజయం మరో విజయాన్ని అందుకోమని చెబుతుంది. అందుకే మరింత అందంగా తయారవడానికి మరో ఐదు కిలోలు తగ్గే పనిలో పడ్డారు. ఆట నాదే వేట నాదే అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ ప్రొఫెసర్ గా కనిపిస్తుండగా.. ఆయనకీ బామ్మర్దిగా రోహిత్క నిపించనున్నారు. ఇక రోహిత్ మరదలిగా తెలుగు నటి ఈషా రెబ్బా నటించనున్నట్లు తెలిసింది. రీసెంట్ గా బరువుతగ్గిన నారా రోహిత్ ని చూసిన వారందరూ ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు.