నేచురల్ స్టార్ నాని హీరోగా ‘ట్యాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. పీరియాడికల్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. మొదట ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రకటించారు.. కానీ ఆ తరువాత ఈ ప్రాజెక్టు వెంకట్ బోయినపల్లి చేతుల్లోకి వెళ్ళింది.40కోట్ల నుండీ 50కోట్ల బడ్జెట్ లోపే ఈ చిత్రాన్ని పూర్తి చేసే విధంగా స్క్రిప్ట్ లో పలు మార్పులు కూడా జరుగుతున్నాయట.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉంటుందట. హీరో పాత్ర తరువాత అంత ప్రాముఖ్యత కలిగిన పాత్ర అదే అని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం మంచి వాయిస్ కలిగిన మీడియం రేంజ్ హీరో అయితే బెటర్ అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ క్రమంలో నారా రోహిత్ ను సంప్రదించినట్టు సమాచారం.అతను ఇంకా ఈ ప్రాజెక్టుకి ‘యెస్’ అని అయితే చెప్పలేదట. ‘అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలా?’ అనే ఆలోచనలో కూడా పడినట్టు తెలుస్తుంది.
అయితే దర్శకనిర్మాతలు అతన్ని కన్విన్స్ చేసే ప్రయత్నాలు మాత్రం ఆపలేదట. ఈ చిత్రంతో పాటు అల్లు అర్జున్- సుకుమార్ ల ‘పుష్ప ‘ చిత్రం కోసం కూడా నారా రోహిత్ ను సంప్రదించినట్టు కొద్దిరోజుల నుండీ వార్తలు వస్తున్నాయి. మరి వీటికి అతను ఓకే చెబుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?