Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

కామెడీ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజేంద్రప్రసాద్ వంటి వారిని స్టార్స్ గా నిలబెట్టింది కూడా కామెడీనే. ఆ ఇమేజ్ తో ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వచ్చారు.

Panchali Panchabhartruka

అందులో భాగంగానే రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో ‘పాంచాలి పంచభర్తృక’ అనే సినిమా రూపొందింది. ‘రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్’ మరియు ‘ఓం సాయిరాం ఆర్ట్స్’ బ్యానర్లపై రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి (USA) ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన ‘సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట’ అనే రెట్రో వైరల్ అయ్యింది. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర చిత్ర బృందం అందరికీ స్పెషల్ థాంక్స్ తెలిపారు.

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..  “చాలా కాలం తర్వాత నాలోని పాత రాజేంద్రప్రసాద్‌ను గుర్తుచేసే పాత్ర ఇది. పాటలు, ఫైట్లు, కామెడీ.. ఇలా కంప్లీట్ ప్యాకేజీతో అలరించబోతున్నాను” అంటూ తెలిపారు.

జెమినీ సురేష్ మాట్లాడుతూ.. “మంచి హెల్ధీ కామెడీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ట్రీట్ అనిపిస్తుంది. ఆ కామెడీ టైమింగ్‌ను పట్టుకోవడం ఒక సవాలుగా అనిపించింది” అంటూ తెలిపారు.

నిర్మాత అలాగే నటుడు అయినటువంటి రాజ్ పవన్ మాట్లాడుతూ… “నూతన నటుడైన నాకు ఈ సినిమా ఒక పెద్ద పరీక్ష లాంటిది. ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గకుండా, క్వాలిటీతో ఈ సినిమాను నిర్మించాం. మా కో-ప్రొడ్యూసర్స్ శ్రీకాంత్ శెట్టివారి, సాయినాథ్ మన్యం సహకారం మరువలేనిది” అంటూ తెలిపారు.

వెంకట్ దుగ్గిరెడ్డి (USA) మాట్లాడుతూ… “నెల్లూరు యాసలో సాగే నా పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నాలోని అసలైన నటుడిని బయటకు తీసిన సినిమా ఇది” అంటూ తెలిపారు.

దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ…”బాబీ ఇచ్చిన బలమైన కథను తెరకెక్కించడానికి కామెడీని ఆయుధంగా చేసుకున్నాను. రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే మా లక్ష్యం. ఇందులో డైలాగ్స్ ఖచ్చితంగా ట్రెండ్ అవుతాయి” అంటూ అభిప్రాయపడ్డారు.

స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus